మార్గ నిర్దేశకులుగా ఎదగాలి: జాయింట్ కలెక్టర్ రాంకిషన్

మార్గ నిర్దేశకులుగా ఎదగాలి
- విద్యా, విలువలతోనే అభివృద్ధి
- నిరక్షరాస్యత వల్లే వెనకబడ్డాం
- జాయింట్ కలెక్టర్ రాంకిషన్
కల్వకుర్తి టౌన్: క్రమ శిక్షణతో చదివి, ఉన్నతమైన ఆలోచనలు కల్గి ఉండి రేపటి తరానికి భవిష్యత్ మార్గ నిర్దేశకులుగా ఎదుగాలని జాయింట్ కలెక్టర్ రాంకిషన్ అన్నారు. శనివారం ఆయన పట్టణ పరిధిలోని అక్షర వనాన్ని సందర్శించారు. వివిధ జిల్లాల ఆవాస కేంద్రాల నుంచి అక్షర వనానికి వచ్చిన అనాథ విద్యార్థులకు నిర్వహించిన లిటిల్ లీడర్స్ - లిటిల్ టీచర్స్ పది రోజుల క్యాంపు కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

వందేమాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర వనంలో వివిధ కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థులు కల్ప వృక్షాలుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. పాలమూరు జిల్లా నిరక్ష్యరాస్యత మూలంగానే వెనుకబడిన జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్షర వనం నిర్వహిస్తున్న విద్యా పరిశోధనా కార్యక్రమాల వల్ల జిల్లాలో అక్షరాస్యత పెరుగడంతో పాటు, మధ్యలో చదువు మానేసేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని అన్నారు. కొన్ని దేశాల్లో ప్రకృతి వనరులున్నప్పటకీ ప్రజల్లో విద్య, విలువలు, మంచి ఆలోచనలు లేకపోవడం వల్ల ఆ దేశంలో అశాంతి నెలకొంటుందని ఇరాన్, ఇరాక్ దేశాలను ఉదహరించారు. ప్రకృతి సహకరించకపోయినా విద్య, ఉన్నత విలువలు కలిగిన జపాన్, సింగపూర్ దేశాలు ఎంతో పురోగతిని సాధించాయని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికి వందేమాతరం ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఆంగ్ల భాష మీద మోజుతో తెలుగు భాషను తక్కువగా చూడవద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తెలుగు భాషపై పట్టు కలిగి ఉన్నందువల్లనే రాష్ర్టాధి నేతగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారని, తన వాక్చాతుర్యంతో అన్ని వర్గాల వారిని మంత్రముగ్దుల్ని చేసి తెలంగాణ రాష్ట్రం ఏరాటుకు దోహదపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో కల్వకుర్తి తహసీల్దారు మంజుల, వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు శేఖర్‌రెడ్డి, సేవాభారతి స్టేట్ కోఆర్డినేటర్ సుబ్రమణ్యం, కోశాషాధికారి స్వామి, విద్యాభారతి కోఆర్డినేటర్ శరవణ్, స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు మాధవరెడ్డి, ఎమ్‌ఎన్‌ఎస్ కోఆర్డినేటర్ నాగయ్య, వందేమాతరం సిబ్బంది చిత్తరంజన్‌దాసు, శేఖర్ చౌహాన్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March