కల్వకుర్తి : కళలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు : ఎమ్మెల్యే


కళలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింబిస్తాయని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. కల్వకుర్టి పట్టణంలో స్వర్ణ భారతి కళా నిలయం ఆద్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరైయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కళా ప్రదర్శనలు పలువురిని అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గుర్కా జైపాల్‌యాదవ్‌, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి, వందేమాతరం ఫౌండేషన్‌ ఉపాధ్యక్షులు శ్రీపతిరెడ్డి, కౌన్సిలర్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ పసులు సుదర్శన్‌రెడ్డి, నాయకులు కే.శేఖర్‌రెడ్డి, ఎస్‌. విజయ్‌గౌడ్‌, జగన్‌, కృష్ణగౌడ్‌, సంస్థ డైరెక్టర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Source: http://prabhanews.com/
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016