గణిత సామర్థ్యం పెంపునకు వేసవి శిబిరాలు

నవతెలంగాణ-మెట్టుగడ్డ
విద్యార్థులో గణిత సామర్థ్యాలను పెంచేందుకు వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ టికె.శ్రీదేవి విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో అక్షరాస్యత అతి తక్కువగా ఉందని, ముఖ్యం గా గణిత అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం ఆమె తన క్యాంపు కార్యల యంలో బ్యాంకర్లు, విద్యాశాఖాధి కారులతో వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో బడి మానేసే వారి సంఖ్య అధికంగా ఉంద న్నారు. గణిత సామర్థ్యాలను పెంచేందుకు 3 ప్రాం తాల్లో వేసవి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయా లన్నారు. మొత్తం 2600 ప్రభుత్వ పాఠశాలల నుండి 1050 మంది 4 నుండి 7 తరగతుల పిల్లలను ఎంపిక చేసి 40 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలన్నారు. గతేడాది నైపుణ్యాలపై సర్వే నిర్వహించగా ఒక లక్షా 25వేల మంది విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణులు కాగా కేవలం 45వేల మంది మాత్రమే ఇంటర్‌కు వెళ్లడం ఆందోళన కల్గిస్తుందన్నారు. డిగ్రీకి వెళ్లిన వారు 23వేల మంది, బీఈడీకి వెళ్లిన వారు 12,500 మంది మాత్రమే అన్నారు. బడి మానేసిన పిల్లలు పత్తి పొలాల్లో పనులకు, స్వంత పనుల కోసం మధ్యలో బడి మానేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు చదు వుతో పాటు ఇతర కార్యక్రమాలపై ఆసక్తి పెంచాల న్నారు. ఇందుకు కలెక్టర్‌ నిధుల నుండి స్మార్ట్‌ తరగ తులు, ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తామన్నారు. కల్వకుర్తిలోని వందేమాతరం ఫౌండేషన్‌ ద్వారా గతేడాది 100 మంది విద్యార్థులకు గణిత సామర్థ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వగా విజయవంతమయ్యిందన్నారు. పూర్తి రెసిడెన్సియల్‌ స్థాయిలో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వ హించాలన్నారు. ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహాకారం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. దాతలు పాలమూరు సేవానిధి అకౌంటు నెంబర్‌: 62280067371కు విరాళాలు పంపాలని కోరారు. సమావేశంలో ఎస్‌బిఐ, ఎస్‌బి హెచ్‌, ఆంధ్రాబ్యాంకు ప్రాంతీయ మేనేజర్లతో పాటు పరిశ్రమల మేనేజర్‌ రవీందర్‌ పాల్గొన్నారు.
Source: http://www.navatelangana.com/article/mahaboobnagar/282964
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March