ప్రభుత్వ బడులు బాగుపడితే బడుగులు బాగుపడుతారు : వందేమాతరం ఫౌండేషన్‌

తొర్రూరు మేజర్‌న్యూస్‌ ః- మండల కేంద్రంలోని స్థానిక నితిన్‌ భవనంలో వందేమాతరం ఫౌండేషన్‌ తక్కెల్లపెల్లి రవింరద్‌ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల పదవతరగతి అధ్యాయనం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రధేశ్‌ శాసనమండలి చైర్మెన్‌ డా ఏ.చక్రపాణి మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని సమాజం అంటే వ్యక్తులలో మార్పులు వచ్చినపుడే వ్యవస్థ మారుతుందని , విద్యార్థులు బాల్య ధశనుండే పిల్లల కు ఆత్మవిశ్వాసం, వ్యవస్థపై మార్పుకై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులలో పూర్తి విశ్వాసాన్ని భవిష్యత్తుకు భరోసా అందించాలని, విద్యతోపాటుగా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుటకు కృషి చేయాలని అన్నారు. కుల మతాల కతీతంగా ముందుకు వెల్లాలి , బాగా చదివి పరీక్షలు బాగా రాయాలని వారు అన్నారు. 

గౌరవ సభాధ్యక్షులు ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ చుక్కారామయ్య మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం సచ్చీలత , దేశభక్తి క్రమశిక్షణను నే ర్చుకున్న వారు జీవితంలో మంచి లక్షణాలతో ఎదుగుతారు. పిల్లల భావిజీవితం పదవతరగతినుంచి రూపోందుతుందని , వారి అభివృద్దికోసం వందేమాతరం ఫౌండేషన్‌ చేస్తున్న కృషిని అభినందించారు. పేద వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తే వారి యొక్క నైపుణ్యాన్ని నిరూపించగలమని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలకు స్వేచ్చ ఇచ్చినప్పటికే వారి మానసిక వికాసం పెరుగుతుంది. విద్యారంగాన్ని మిల్ట్రీ కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉద్యొగం కోసం బావించే వారు సమాజం కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరు మంచిగా చదివి బావిభారత పౌరులు గా తీర్చిదిద్దాలని వారు అన్నారు. విద్యాశాఖ పాఠశాల కమీషనరు మాతృశ్రీ ఉషారాణి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో 60 శాతం విద్య కోసం ప్రభుత్వం వెచ్చించిందని, విద్యార్థుల పరిరక్షణ విద్యాభివృద్దికై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 

విద్యార్దులు బాల్యదశనుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని క్రమశిక్షణతో ఆశయసాధనకు కృషి చేసిన ట్లయితే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు. వరంగల్‌ జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శాలను ఆశయాలుగా తీసుకోవాలని , ప్రజాస్వామ్యబద్దమైన వ్యవస్థను మార్చగలిగే వ్యక్తులుగా నేటి విద్యార్థులు తయారయ్యారని అన్నారు. విద్యార్థులు నిరంతరం క్రమశిక్షణ, జ్ఞానసముపార్జన కావాలని అన్నారు. రూరల్‌ ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులలోని నైపుణ్యాన్ని గుర్తించి ,వారిని దేశానికి ఉపయోగపడే విధంగా మలిచే భాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. విద్యార్థులు సాధించే మార్కులు వారి యొక్క మేధస్సుకు ఏనాటికి కొలమానం కాదని అన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జీవితంపై అవగాహన కలిగే విధంగా పోలీస్‌జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వాట్‌నెక్స్‌‌ట అనే కార్యక్రమాన్ని ప్రారంబించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఆర్‌జేడి ఆర్‌.సురెందర్‌రెడ్డి, మహ-బాద్‌ ఆర్‌డివో భిక్షూనాయక్‌ , చైర్మెన్‌ కైన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవిల్యూషన్‌ లీలా లక్ష్మారెడ్డి, డీఈవో సిహెచ్‌ రమేష్‌ , ఆర్‌విఎం పివో వరంగల్‌ రాజమౌలి తదితరులు పాల్గొన్నారు.

Source: http://www.suryaa.com/local-news/article.asp?category=22&ContentId=156998
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March