Vandemataram Foundation Featured in Jagriti Telugu Weekly

తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు చదువు కొనసాగించటానికై వందేమాతరం ఫౌండేషన్‌ చూపిన చొరవ ఆదర్శమైనది. చదువు మానేద్దామని నిర్ణయించుకున్న బాలికల్లో 2005 సంవత్సరం నుంచి 1600 మంది ఇప్పుడు ఉన్నత విద్య పూర్తిచేశారు. వీరిలో 398 మంది ఇంజ నీరింగు ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైనారు. అలాంటి వారిలో చాలామంది విజయశీలురైన ఇంజనీర్లుగా ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలు అందుకుంటున్నారు. అంతేకాదు, ఈ ఫౌండేషన్‌తో అనుబంధమున్న బాలికలు తమ తమ గ్రామాలకు చెందిన ఇతర బాలికలకు, మహిళలకు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ సమస్యల్లో చేయూత కూడా ఇస్తున్నారు.
ఈ పథకం తొలిదశలో బాలికలు విద్యాభ్యాసం పూర్తిచేసే లోపున వారి పెళ్ళి గురించి ఆలో చించవద్దని తల్లిదండ్రులకు నచ్చజెప్పటం జరిగింది. రెండోదశలో వారి పుస్తకాలు, ఫీజుల కోసం, వారిని రోజూ కళాశాలలకు తీసుకువెళ్ళే బస్సులకు పాస్‌ల కోసం ఏర్పాట్లు జరిగాయి. ఆపైన ప్రతి మూడు నెలలకు ఈ బాలికలకు కౌన్సిలింగు, వ్యక్తిత్వ వికాసాలకై వర్క్‌షాపులు నిర్వహించారు. ఇప్పటిదాకా ఈ పథకం క్రింద 1600 మంది బాలికలు తమ విద్యాభ్యాసం పూర్తిచేశారు.
ఫౌండేషన్‌ జరిపిన మరో ఆసక్తిదాయకమైన ప్రయోగం బాలసభల నిర్వహణ. బాల లందరూ ఒకచోట చేరి వివిధ తాజా వ్యవహా రాల (కరెంట్‌ అఫైర్స్‌) పై యథేచ్ఛగా తమ భావాలు వ్యక్తం చేస్తారు. వ్యాస రచన పోటీలు కూడా కొన్ని నిర్వహించారు. ఉపాధ్యాయు లకు శిక్షణ కూడా ఇస్తున్నారు.