అక్షరవనం ప్రజాహితం


విద్య, పరిశోధన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రముఖులు, విద్యతోనే సమాజంలో మార్పు 
ఉపాధ్యాయులు, యువత విద్యారంగం ఆవశ్యకతను వివరించాలి: కలెక్టర్ టీకే శ్రీదేవి
విద్యార్థులు లక్షసాధనతో చదువుల్లో రాణించాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అక్షరవనం విద్యారంగంలో మార్పునకు వేదిక కావాలి: విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య
తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ మార్కుగా గుర్తింపు సాధించాలి: ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
కల్వకుర్తి: పట్టణ సమీపంలోని కల్వకుర్తి, దేవరకొండ రోడ్డులో వందేమాతరం ఫౌండేషన్ అధ్వర్యంలో శనివారం పన్నెండెకరాల స్థలంలో విద్య, పరిశోధన శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ టికె శ్రీదేవి, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, విద్యావేత్త డా.చుక్కరామ య్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడారు. తాను ప్రభుత్వ పాఠశాల్లో చదివే ఈ స్థాయికి ఎదిగానని, మీ రంతా లక్షసాధనతో చదువుల్లో రాణించాల న్నారు. తల్లిదండ్రులు దగ్గరకు పిలుచుకొని మీ వల్ల మాకు, పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు తెచ్చారని అభినందించే స్థాయికి ఎదగాలని సూచించారు. అక్షరవనం ఇలాంటి మేధావుల ను తయారు చేసేందుకు వేదిక కావడం అభి నందనీయమన్నారు.
భవిష్యత్‌లో ఈ అక్షరవనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కలాం, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌లాంటి మహానుభావులుగా సమాజ మార్పు కోసం కంకణ బద్దులు కావాలని పిలు పునిచ్చారు. విద్యావేత్త చుక్క రామయ్య మా ట్లాడుతూ అక్షరవనం విద్యారంగంలో మార్పు తెచ్చేందుకు వేదిక కావాలని, భవిష్యత్‌లో దేశ చరిత్రను మార్చే వారంతా మీరేనని ఈ సంద ర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మా ట్లాడారు. అక్షరవనం ఎన్నో మార్పులకు, ఎం దరో విద్యార్థుల్లో గొప్ప విజ్ఞానాలను బయట కు తీసే వేదిక కావాలని, ప్రభుత్వపరంగా కూ డా జిల్లా యంత్రాంగం సహకరించాలని ఆయ న సూచించారు. ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో అ క్షరవనం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ మార్కు గా గుర్తింపు సాధించాలని ఆకాంక్షించి, వందే మాతరం ఫౌండేషన్ సభ్యులను అభినందిం చారు. ముఖ్యంగా 12 ఎకరాల స్థలాన్ని తమ వంతు మార్పు కోసం యడ్మ మోహన్‌రెడ్డి కు టుంబసభ్యులు చేసిన త్యాగాన్ని అందరూ అభినందించారు.
అంతకుముందు అక్షరవ నంలో జ్యోతి ప్రజ్వలన చేసి అక్షరవనం ప్రజా హితం కోసం అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వందేమాతరం ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పా టు చేసిన అక్షరవనం తెలుగు బుక్ ఆఫ్ రికా ర్డులో స్థానం దక్కించుకుందని, అందుకు సం బంధించిన ప్రశంస పత్రాన్ని సభలో బుక్ ఆఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతబండ్ల వెంకటాచా రి అందించారు. అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన కార్యక్ర మాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకు డు రవీందర్, గ్రీన్ ఫర్ రెవెల్యూవేషన్ అధ్య క్షురాలు లీలా లకా్ష్మరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలం, ఎంపిపి రామేశ్వరమ్మ, జడ్‌పి టిసి అశోక్‌రెడ్డి, తహసీల్దార్ శ్యాంసుందర్, వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు, యడ్మ మాధవరెడ్డి కుటుంబ సభ్యులు, పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొన్నారు.


Source: http://manatelangana.news/index.php/district-collector-sridevi-speech-about-education
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March