పేద విద్యార్థులకు ఉచిత విమానయానం

  • 07/06/2012
హైదరాబాద్, జూన్ 6: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన పేద విద్యార్థులకు ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి ఉచిత విమానయాన అవకాశాన్ని కల్పించింది. పదో తరగతిలో 10 పాయింట్లతో ఎ1 గ్రేడ్ సాధించిన విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఇద్దరేసి చొప్పున 52 మందిని వందేమాతరం ఫౌండేషన్ ఎంపిక చేసింది. వీరందరికీ ఫౌండేషన్ తరఫున ప్రతిభా పురస్కారాలను శుక్రవారం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయులను ఆహ్వానించారు. అయితే పేద విద్యార్ధులైన వీరందరికీ ఏవియేషన్ అకాడమి చైర్మన్ క్యాప్టన్ మమత సహకారంతో గురువారం విమానం ఎక్కే అవకాశం కల్పిస్తున్నారు. రవీంద్రభారతిలో ప్రతిభాపురస్కారాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తామని సంస్థ ప్రధానకార్యదర్శి వై. మాధవరెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రజల ముందుంచాలనే ఆశయంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, వివిధ శాఖల సీనియర్ అధికారులు, కార్యదర్శులు పాల్గొంటారు. నూరు శాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులకు సైతం సత్కారం చేస్తామని వివరించారు. ప్రతిభాపురస్కారాల కార్యక్రమానికి పాఠశాల విద్య కమిషనర్ శివశంకర్, అపార్టు కమిషనర్ కృష్ణ చంద్రవౌళి, డిఐజి వి సి సజ్జనార్, రాజీవ్ విద్యా మిషన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉషారాణి, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ జనార్దనరెడ్డి, పరీక్షల డైరెక్టర్ మన్మధరెడ్డి తదితర అధికారులు హాజరవుతారు.

source: Andhra Bhoomi 
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March