Vandemataram foundation Pratibha Puraskar Mahaboobnagar

EENADU : 4th July 2010
ప్రతిభకు పురస్కారం:
136 మంది విద్యార్థులకు సన్మానం
క్లాక్‌టవర్‌(మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే : విద్యారంగంలో వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులను వందేమాతర ఫౌండేషన్‌ ఘనంగా సన్మానించింది. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగిన విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్‌ దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్‌ విద్య అందిస్తుందన్నారు. కరువు జిల్లాగా పేరొందిన జిల్లాలో విజ్ఞానికి కొదవలేదని అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ చూపుతున్నారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కలెక్టర్‌ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా తమవంతు కృషి చేస్తున్న విద్యావంతులు, ఎన్‌జీవోలు, వ్యాపారవేత్తలను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లలాగా భావించి విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. వందేమాతరం ఫౌండేషన్‌ ద్వారా నాగర్‌కర్నూల్‌ మండలంలోని పెద్దమద్దనూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సి.ఆశోక్‌ పదో తరగతి వార్షిక పరీక్షలో 570 మార్కులు సాధించినందుకు బంగారు పతకం అందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సౌమ్యకు (566), రామాంజనేయులు(564)ను సన్మానించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 136 మంది విద్యార్థులను, వారి ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను సత్కరించారు. ఇటీవల గిన్నీస్‌ పుస్తకంలో చోటు సంపాందించిన పాలమూరు విశ్వవిద్యాలయం ప్రొ.శ్రీనాథాచారిని జడ్పీ ఛైర్మన్‌, కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, జడ్పీ సీఈవో రాజేశ్వర్‌రెడ్డి, డీఈవో హేమ్‌నాథ్‌, వందేమాతరం ఫౌండేషన్‌ నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, మాధవరెడ్డిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March